Testimonials
This page shows testimonials from Human4ce workshops and also other workshops based on Colors of Humanity.
You would see, in these testimonials, references to other related concepts such as layers and polarities that detail more dimensions of human diversity.
Bhaskara Reddy Chittreddy
November 3, 2010
అది నీవై యున్నావు.
ఏది నీవై యున్నావు? .. ఆకారము నీవే .. నిరాకారము నీవే … అనంతము నీవే … అతి సూక్ష్మము నీవే …
ఈ అనంతమైన విశ్వం ఓంకారమే అయితే .. నీవు వేరు, నేను వేరా? కాదు కాదు. నీవే నేనై యున్నాను. నేను భాస్కర రెడ్డి అను ఓంకారమై యనున్నాను. ఓం has infinite meanings. One of them is “welcome to life”. ఓంకార స్వరూపమైన ఈ జీవితాన్ని పద్మమని మీరన్నారు. పద్మవ్యూహం కాదని శంకరరావు గారన్నారు. పద్మవ్యూహం వర్ణనాతీతం. విప్పలేని చిక్కుముడి. చిక్కుముడి విప్పుతుంటె విప్పేవాడు ముడి విప్పు తున్నాననే భ్రమలో ఉంటాడు. ఎందుకంటె వానికి తెలియకుండ కొత్తముళ్ళు పడుతుంటాయి కనుక. పద్మం అతి నిర్మల స్వరూపం. దానికున్న నాలుగు రేకులు ధర్మ, అర్థ, కామ మరియు మోక్షాలన్న విస్పష్ఠమైన ఒక సందేశం, జీవితం మోక్ష సాధనకేనన్న నా భావనకు, కాని ఏంచేయాలో, ఎలా చేయాలో తెలియని చిక్కుముడిలాంటి ప్రశ్నలకు సమాధాన మిచ్చింది.
పద్మం వికసించాలంటే బురద నీరు మరియు సూర్యరశ్మి ఏలా అవసరమో, జీవితం పరిమళించాలంటే ధర్మ, అర్థ, కామ మరియు మోక్షాలు ఆచరించాలన్నారు. పద్మానికున్న నాలుగు రేకులలో ఏ ఒక్కటి వాడిపోయినా దాని అందం తగ్గినట్లు, ధర్మ, అర్థ, కామ మరియు మోక్షాలలో ఏ ఒక్కటి వదిలినా జీవితం సార్థకం కాదనిపించింది. ఈ నాల్గింటిలో కొన్ని అత్యంత ఆనందాన్నిస్తాయి. కొన్ని ఆనందాన్నియ్యవు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు: కర్మలను ఆచరించు – వాటి ఫలితాలను ఆశించకు. కర్మ చేయడం భగవత్ సేవ అయితే వాటి ఫలితం భగవత్ ప్రసాదం. ప్రసాదంలో మంచి చెడు ఉండదు కదా.
పిపీలకాది బ్రహ్మ పర్యంతం .. చేపపిల్లకు ఎవరు ఈత నేర్పారు? పుట్టిన పసిపాపకు ఆకలైతే అమ్మ స్తన్యం తాగాలని ఎవరు నేర్పారు? ఇలాంటి అనేకమైన సందేహాలకు Fractal అనే Concept ద్వార జీవి వేరు ప్రకృతి వేరు కాదని, జీవి ప్రకృతి యొక్క అంశ అని, దీనికి పుట్టుకతోనే ప్రకృతి గురించి తెలుసు అనే చెప్పడం నభూతోః.
Don’t break the shell – give warmth. నది దాటాలంటే upstream లో వెళ్ళడం Break the shell. దాటడానికి చాలా ప్రయాస కావాలి. Give warmth down stream లా వెళ్ళడం చాలా తేలిక. ఎదుటివారి ఓం ని అర్థం చేసుకుని సలహా ఇస్తే warmth. మన ఓం ని వాళ్ళపై రుద్దితే Break the shell. ఇది అర్థమైతే ఎదుటివాడితో good relation maintain చెయ్యడం చాలా తేలిక.
మీరు చెప్పిన ఇండిక్ ధాట్ (Indic thought) విన్నాక నాకు ఒకటి గుర్తుకొచ్చింది:
మతములన్నియు కూడి మంచియే బోధించె,
మనసు మంచిదైతె మతమేది చెడ్డ,
తెలిసి మెలగ వలయు తెలుగు సుతుడా.
హైందవ మతం ఒక మతం మాత్రమే కాదు ఇది వ్యక్తి, సమాజం యొక్క పరిపూర్ణ జీవన విధానాన్ని తెలిపే వ్యవస్థ అన్నారు. అట్లే ఇతర మతములయొక్క మంచిని పొగిడారు. అవును ఎవడు తన మతాన్ని పూర్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తాడో వాడు ఇతర మతాలను గౌరవిస్తాడు. ఇతర మతస్థులను ప్రేమిస్తాడు.
ఒకరు జాతిని ఏకీకృతం చేసిన గొప్పనాయకుడు … ఒకరు ఎదుటివాడికి కలిగిన కష్టానికి తన కన్నీరు కార్చే ప్రేమస్వరూపం … తన స్వార్థం కోసం కన్నవారినే చంపే కసాయి … ఒకరికి ఒకటి ఇష్టం మరొకరికి మరొకటి. ఎందుకిలా మనుషులు వేర్వేరు స్వభావాలతో, ఎందుకు ఒకలా ఆలోచించరు? ఇలాంటి సందేహాలెన్నో! వీటన్నిటికీ ఒకే సమాధానం ఎవరి Color వారిది. పిండికొద్ది రొట్టె అన్నట్లు. Color ఒక మాయ. యథా color తథా మనుష్య. నా color నాకు తెలిసింది, వేరే Colors కూడ ఉంటాయని తెలిసింది. ప్రపంచం రంగుల మయం అనిపించింది. What a color Sirji!
చివరగా ఒక విషయం చెప్పాలను కుంటున్నాను. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆక్షణానికి అది అత్యుత్తము కాబట్టి always be happy అన్న concept చాల బాగ నచ్చింది. Sir, ఇది అర్థమైతే బాధ పడడం మరిచిపోతారు మనుషులు.
మీ ఓం నా ఓం కలవడం, మేధాజననానికి రావడం అంతా భగవత్ కృప. మేధాజననం వలన నాకు ఒక గురువు దొరికారు. ఒక సత్సంగం పరిచయమయింది. వేయి పుస్తకాలు చదవడం కన్న ఒక మంచి గురువుని ఆశ్రయించమని మన పెద్దలు ఎందుకన్నారో నాకు అవగతమైనది. ఒక book ఏదైన ఒక Subject నే deal చేస్తుంది. కాని మన మేధాజననం ఒక రాజనీతి, ఒక మనోవిజ్ఞానం, ఒక అర్థశాస్త్రం, ఒక ఆధ్యాత్మిక పురాణం. ఒకటేమిటి చాలా విషయాలను తెలియజేసింది.
____
భాస్కర రెడ్డి