Testimonials

This page shows testimonials from Human4ce workshops and also other workshops based on Colors of Humanity.

You would see, in these testimonials, references to other related concepts such as layers and polarities that detail more dimensions of human diversity.

Annapurna Kambhammettu
November 6, 2010
మేధాజననం workshop attend అవ్వడం నాకొక చక్కటి అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చింది. ఆ తర్వాత దీనిని గురించి నాలో ఆలోచనలు అంతర్మధనం మొదలయ్యాయి. జీవన రథం గురించి కుటుంబం గురించి సమాజం గురించి వాటికి సంబంధించి నాపాత్ర గురించి నాలో ఆలోచనలు అంతరి్విమర్శ ఎక్కువయ్యాయి .

ఆధ్యాత్మిక విషయాల గురించి నా భావనలలో ఇంతకుముందు ఉన్న అస్పష్టత తొలగిపోయి మంచి స్పష్టత ఏర్పడింది. నా ఆలోచనలకు బలమైన support మేధాజననం ద్వారా దొరికింది. ఇంతకు ముందు ఎంతో జటిలంగా అనిపించిన ఈవిషయాలు ice cream తిన్నంత సులభంగా మనసు లోకి చొచ్చుకుపోయాయి.

ఓం cycles తో రోజూవారి జీవితంలో ఇతరుల మనః స్థితినిఇంతకు ముందు కంటే బాగా అర్ధం చేసుకో గలుగు తున్నాను.

ఇంకా విశ్వ స్పర్శ ధ్యానం లో నాకు emotional cleansing బాగా జరిగింది. బాగా enjoy చేశాను. స్త్రీ పురుష తత్వం గురించి వినక ముందుమగవాళ్లెందుకు ఇలా ప్రవర్తిస్తారు మనలా ఆలోచించవచ్చు గదాఅనుకునేదాన్ని. ఇప్పడు అది వాళ్ళతత్వం ఇది మనతత్వం అనిపిస్తుంది.

Colour concept నాకు చాలా interesting గా అనిపించింది. దానిని ఉపయోగించి మా family members,friends colours అర్థం చేసుకోవదానికి ప్రయత్నిస్తున్నాను.

నేను నాకు 16 ఏళ్ళ వయసు నుండి 22 ఏళ్ళ వయసు వరకు మా అన్నయ్య దగ్గర ఉన్నాను. జీవితానికి సంబంధించిన చాలా విషయాలు తన దగ్గర నుండి నేర్చు కొన్నాను. మళ్ళీ మేధాజననం ద్వారా ఎన్నో విలువైనవిషయాలు తననుండి నేర్చుకొనే అవకాశం లభించి నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

అన్ని విధాలా సమగ్రమైనట ఇంత మంచి workshop ను రూపొందించి అందించిన మా అన్నయ్య కు నా ధన్యవాదాలు మరియు అభినందనలు. ఇలా ఎంతో ఉపయుక్తం గా ఉన్న ఈ మేధాజననం మరెందరికో చేరువవ్వాలని ఆశిస్తున్నాను.

Thanks for giving me the opportunity to express myself.

కంభంమెట్టు అన్నపూర్ణ
Human4ce